Logo
Download our app
మే 19న శ్రీ‌వారి ఆర్జితసేవా టికెట్లు రిలీజ్
NEWS   May 16,2025 04:17 pm
శ్రీ‌వారి భ‌క్తుల‌కు తీపి క‌బురు చెప్పింది టీటీడీ. తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన ఆగ‌స్టు నెల కోటాను మే 19న ఉదయం 10 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం మే 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు మే 21 నుండి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్‌లో టికెట్లు మంజూరవుతాయి.
⚠️ You are not allowed to copy content or view source