Logo
Download our app
క్లీన్ ఎనర్జీ విప్లవానికి పునాదిరాయి రెన్యూ
NEWS   May 16,2025 03:45 pm
ఈ రోజు రెన్యూపవర్ ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్టుకు మేం వేస్తున్న పునాదిరాయి..భారతదేశ క్లీన్ ఎనర్జీ విప్లవానికి పునాదిరాయి లాంటిదని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం బేతపల్లి గ్రామంలో రెన్యూ పవర్ సంస్థ స్థాపించనున్న రూ.22 వేల కోట్ల విలువైన 4.8 గిగావాట్ల హైబ్రిడ్ ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్టుకు భూమిపూజ చేశారు. రెన్యూ పవర్ పునరుత్పాదక ఇంధన సముదాయ ప్రారంభోత్సవం సాహసోపేతమైన నిర్ణయానికి, స్థిరమైన ప్రగతికి చిహ్నం అన్నారు. ఈ చారిత్రాత్మక క్షణంలో భాగం కావడం తాను అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు.
⚠️ You are not allowed to copy content or view source