Logo
Download our app
వల్లభనేని వంశీ పై మరో కేసు న‌మోదు
NEWS   May 16,2025 09:41 am
గ‌న్న‌వ‌రం మాజీ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీకి దెబ్బ మీద దెబ్బ త‌గులుతోంది. ఇప్ప‌టికే కోర్టు బెయిల్ మంజూరు చేసిన ఆనందం కొంత సేప‌టికే ఆవిరై పోయింది. న‌కిలీ ప‌ట్టాల కేసులో పీటీ వారెంట్ జారీ చేశారు పోలీసులు. 19లోగా నూజివీడు సెకండ్‌ అడిషనల్‌ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో హాజరు పరచాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 2019లో గన్నవరం ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో వంశీ బాపులపాడు మండలంలో ఓటర్లను ప్రభావితం చేయడానికి నకిలీ పట్టాలు ఇచ్చారనే అభియోగంతో ఆయనపై కేసు నమోదైంది.
⚠️ You are not allowed to copy content or view source