Logo
Download our app
బీజేపీ మంత్రిపై మండిప‌డ్డ సీజేఐ
NEWS   May 15,2025 03:56 pm
క‌ల్న‌ల్ సోఫియా ఖురేషీపై నోరు పారేసుకున్న మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్ర బీజేపీకి చెందిన మంత్రి విజ‌య్ షాపై సీరియ‌స్ అయ్యారు చీఫ్ జ‌స్టిస్ ఆఫ్ ఇండియా జ‌స్టిస్ బీఆర్ గ‌వాయ్. వెంట‌నే క్ష‌మాప‌ణ చెప్పాల్సిందేన‌ని ఆదేశించారు. లేక‌పోతే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంద‌ని వార్నింగ్ ఇచ్చారు. ఒక బాధ్య‌త క‌లిగిన ప‌ద‌విలో ఉన్న మీరు సంయ‌మ‌నం పాటించ‌క పోతే ఎలా అని ప్ర‌శ్నించారు. ప‌దిమందికి ఆద‌ర్శంగా ఉండాల్సిన వాళ్లు ఇలా మాట్లాడితే ఎలా అని నిల‌దీశారు. వెంట‌నే హైకోర్టుకు వెళ్లి సారీ చెప్పాలన్నారు.
⚠️ You are not allowed to copy content or view source