Logo
Download our app
టీపీసీసీ చీఫ్ కు రెండు ప‌ద‌వులు ఎందుకు..?
NEWS   May 15,2025 11:56 am
మహేష్ కుమార్ గౌడ్‌కు ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు రెండు పదవులు ఎందుకు అంటూ నిప్పులు చెరిగారు కాంగ్రెస్ పార్టీ మ‌హిళా అధ్య‌క్షురాలు సునీతా రావు. ఏదో ఒక‌టి ఉంచు కోవాల‌ని, ఇంకో దానిని వ‌దిలి వేయాల‌న్నారు. సంవత్సరంన్నర నుండి మహిళా కాంగ్రెస్ పార్టీకి ఒక్క పదవి ఇవ్వలేదని ఆరోపించారు. త‌న‌ను వేధింపుల‌కు గురి చేస్తున్నార‌ని వాపోయారు. ఆర్టీఐకి సంబంధించిన దాంట్లో ఒక్క పోస్టు కూడా ఇవ్వ‌లేదంటూ మండిప‌డ్డారు. లెటర్లు తీసుకు ర‌మ్మ‌న్నార‌ని అన్నీ ఇచ్చామ‌న్నారు. బీఆర్ఎస్, బీజేపీ నుండి వ‌చ్చిన వాళ్ల‌కే ప్ర‌యారిటీ ఇస్తున్నారంటూ ఆరోపించారు.
⚠️ You are not allowed to copy content or view source