ఎంపీ మిథున్ రెడ్డికి భారీ ఊరట
NEWS May 13,2025 04:25 pm
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. అరెస్ట్ చేయవద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టులో విషయం తేలేవరకు అరెస్ట్ చేయవద్దంటూ పేర్కొంది. ఇదిలా ఉండగా తనను కావాలని ఇబ్బందులకు కూటమి సర్కార్ గురి చేస్తోందంటూ ఆరోపించారు ఎంపీ. తాడో పేడో తేల్చుకుంటానని అన్నారు. అక్రమ కేసులు బనాయిస్తే భయపడే ప్రసక్తి లేదన్నారు.