Logo
Download our app
భారత సైన్యం కోసం జనసేన పూజలు
NEWS   May 13,2025 09:57 am
భార‌త సైన్యం విజ‌యం సాధించాల‌ని కోరుతూ జ‌న‌సేన పార్టీ సీనియ‌ర్ నేత‌ల‌తో పాటు మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్ పూజ‌లు చేశారు. బెజ‌వాడ లోని ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర ఆలయంలో విశిష్ట పూజ‌లు జ‌రిపించారు. ఈ సంద‌ర్బంగా మంత్రి మాట్లాడారు. పాకిస్తాన్ కు భార‌త్ స‌త్తా ఏమిటో చూపించారంటూ కొనియాడారు. స‌మ‌ర్థ‌వంత‌మైన నాయ‌కుడైన న‌రేంద్ర మోదీ సార‌థ్యంలో భార‌త త్రివిధ ద‌ళాధిప‌తులు దాడులు చేప‌ట్టార‌ని, పాకిస్తాన్ కు కోలుకోలేని షాక్ ఇచ్చార‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source