Logo
Download our app
మేడమ్‌ టుస్సాడ్స్‌ చరణ్‌ విగ్రహం
NEWS   May 12,2025 11:23 pm
లండన్‌: ప్రఖ్యాత మేడమ్‌ టుస్సాడ్స్ మ్యూజియంలో రామ్‌ చరణ్‌ మైనపు విగ్రహం వ‌ద్ద‌ రామ్‌ చరణ్‌తో పాటు భార్య ఉపాసన, కుమార్తె క్లీంకార, చిరంజీవి- సురేఖ పాల్గొన్నారు. ఆ వీడియోలు తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. వాటిలో.. క్లీంకారకు సంబంధించిన క్యూట్‌ వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తన విగ్రహం పక్కన కూర్చొని రామ్‌చరణ్‌ ఫొటోలకు పోజుళు ఇస్తుండగా.. క్లీంకార ఆ విగ్రహం వద్దకు వెళ్లే ప్రయత్నం చేయడం, చరణ్‌ తన కుమార్తెను ఆపడం అందులో కనిపించింది.
⚠️ You are not allowed to copy content or view source