Logo
Download our app
చార్మినార్‌కు 109 దేశాల అందాల భామ‌లు
NEWS   May 12,2025 10:55 pm
హైదరాబాద్‌లో జ‌రుగుతున్న మిస్ వరల్డ్ పోటీల్లో 120కు దేశాలకు పైగా దేశాల సుందరాంగులు పాల్గొన్నారు. మంగళవారం నాడు 109 దేశాల కంటెస్టంట్లు ప్రపంచ ప్రఖ్యాత చార్మినార్ వద్ద హెరిటేజ్ వాకింగ్ వహిస్తారు. పాత బస్తీలో పాపులర్ మార్ఫా వాయిద్యాలతో స్వాగతం పలుకుతారు. చార్మినార్ వద్ద ప్రత్యేకంగా ఫోటోషూట్ నిర్వహిస్తారు. అనంతరం చార్మినార్ సమీపంలోని చుడీ బజారులో ఎంపిక చేసిన 9 దుకాణాల్లో వివిధ రకాల గాజులు, ముత్యాల హారాలు తదితర అలంకరణ వస్తువుల షాపింగ్ నిర్వహిస్తారు. హైదరాబాద్ బ్యాంగిల్స్, ముజీబ్ బ్యాంగిల్స్, కనహయ్యలాల్, మోతిలాల్ కర్వా, గోకుల్ దాస్ జరీవాల, kr కాసత్, జాజు పెరల్స్ aH జరీవాల, అఫ్జల్ మియా కర్చోబే వాలే దుకాణాల్లో షాపింగ్ నిర్వహిస్తారు.
⚠️ You are not allowed to copy content or view source