Logo
Download our app
మంద మ‌హేష్ కు కేటీఆర్ భ‌రోసా
NEWS   May 12,2025 07:24 am
సౌదీలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సిరిసిల్లకు చెందిన మంద మహేష్‌తో ఫోన్ లో మాట్లాడారు మాజీ మంత్రి కేటీఆర్. త‌న‌కు అండ‌గా ఉంటాన‌ని హామీ ఇచ్చారు. పనికి వెళ్తున్న సమయంలోగాయపడి, అక్కడి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. స్వంత ఖ‌ర్చుల‌తో ఇండియాకు ర‌ప్పిస్తాన‌ని, అధైర్య ప‌డ‌వ‌ద్ద‌ని సూచించారు కేటీఆర్. మెరుగైన వైద్యం చేయిస్తాన‌ని కుటుంబ స‌భ్యుల‌కు హామీ ఇచ్చారు. మంద మహేష్‌ స్వస్థలం సిరిసిల్ల నియోజకవర్గంలోని మండేపల్లి గ్రామం.
⚠️ You are not allowed to copy content or view source