Logo
Download our app
ఈటెల కామెంట్స్ అవాస్త‌వం
NEWS   May 12,2025 06:54 am
హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. బాచుప‌ల్లి ఎమ్మార్వో ఇచ్చిన నోటీసుల‌తో త‌మ‌కు సంబంధం లేద‌న్నారు. ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ చేసిన వ్యాఖ్య‌లు అవాస్త‌వ‌మ‌న్నారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. త‌మ‌పై లేనిపోని ఆరోప‌ణ‌లు చేయ‌డం త‌న‌కు త‌గ‌ద‌న్నారు. హైడ్రాకు ముడి పెడుతూ వ్యాఖ్య‌లు చేయ‌డం ప‌ట్ల తీవ్ర ఆవేద‌న చెందారు. త‌మ‌కు రాజ‌కీయాలు అంట‌గ‌డితే ఎలా అని ప్ర‌శ్నించారు క‌మిష‌న‌ర్. ఆ నోటీసులు ఎందుకు ఇచ్చారో స‌ద‌రు ఎమ్మార్వోను అడ‌గాల‌ని ఎంపీకి సూచించారు రంగ‌నాథ్.
⚠️ You are not allowed to copy content or view source