Logo
Download our app
21 ఉగ్ర‌వాద శిబిరాల‌ను టార్గెట్ చేశాం
NEWS   May 11,2025 08:58 pm
ఇప్ప‌టి వ‌ర‌కు ఆప‌రేష‌న్ సిందూర్ లో భాగంగా పాకిస్తాన్ ఆక్ర‌మిత కాశ్మీర్ లో 21 ఉగ్ర‌వాద శిబిరాల‌ను ల‌క్ష్యంగా చేసుకున్నామ‌ని చెప్పారు డీజీఎం రాజీవ్ ఘాయ్. అవసరమైతే మిగిలినవాటిపై ముందు ముందు దాడి చేస్తామ‌న్నారు. ఉగ్రవాదుల అంతిమయాత్రలో ఎవరెవరు పాల్గొన్నారో ప్రపంచమంతా చూసిందన్నారు. పాక్‌ జెట్లను చాలా కూల్చేశామ‌న్నారు. అవి ఎన్ని అనేవి ఇప్పుడు చెప్పలేమ‌న్నారు. మా లక్ష్యాలన్నింటినీ అందుకున్నామ‌ని, పైల‌ట్స్ అంతా తిరిగి వ‌చ్చార‌ని అన్నారు. భారత్‌ పైలట్‌ను పట్టుకున్నామన్న పాక్‌ ప్రచారం నిజం కాద‌న్నారు. కాల్పుల విర‌మ‌ణ‌ను ఉల్లంఘిస్తే వారికి క‌చ్చితంగా తెలుస‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source