Logo
Download our app
కేశినేని నానిపై బుద్దా వెంక‌న్న ఫైర్
NEWS   May 11,2025 07:04 pm
టీడీపీ సీనియ‌ర్ నేత బుద్దా వెంక‌న్న నిప్పులు చెరిగారు. మాజీ ఎంపీ కేశినేని నానిపై తీవ్ర స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కేశినేని నాని వంటి వారికి చంద్రబాబు రాజకీయ భిక్ష పెట్టారని అన్నారు. అయినా విశ్వాసం లేకుండా త‌మ నాయ‌కుడిపై చ‌వ‌క‌బారు విమ‌ర్శ‌ల‌కు దిగాడ‌ని ధ్వ‌జ‌మెత్తారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. టీడీపీ ఎంపీగా ఉంటూనే మాజీ సీఎం జగన్ కు కోవర్టుగా పని చేశాడ‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. 2019-24 వరకు చంద్రబాబు, లోకేష్, నేను ఇతర నేతలు మద్యం కుంభకోణంపై గళమెత్తామ‌న్నారు. జగన్, అండ్ కో మద్యం మాఫియాపై పోరాటాలు చేశామ‌ని గుర్తు చేశారు బుద్దా వెంక‌న్న‌.
⚠️ You are not allowed to copy content or view source