పాక్ కాల్పుల్లో వీర జవాన్ మృతి
NEWS May 11,2025 12:57 pm
దేశం కోసం ప్రాణాలర్పించాడు మరో సైనికుడు. పాక్ కాల్పుల్లో రైఫిల్ మ్యాన్ సునీల్ కుమార్ వీర మరణం పొందాడు. జమ్మూకశ్మీర్ ఆర్ఎస్ పురా సెక్టార్ లో పాక్ దుశ్చర్యకు బలయ్యాడు. సునీల్ కుమార్ స్వస్థలం జమ్మూలోని ట్రెవా గ్రామం. జవాను మృతదేహాన్ని ఆయన నివాసానికి తీసుకొచ్చారు సహచర సైనికులు. మృతదేహం చూసి కన్నీటి పర్యంతమయ్యారు కుటుంబ సభ్యులు.