భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం
NEWS May 11,2025 10:59 am
పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుండడంతో కేంద్ర సర్కార్ సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని స్పష్టం చేసింది. పాక్ కాల్పుల విరమణ ఉల్లంఘన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపింది. సరిహద్దుల్లో పాక్ చర్యలను తిప్పికొట్టేలా ఆదేశాలు ఇచ్చామన్నారు. ఇప్పటి వరకు సంయమనం పాటించామని , ఇలాగే వ్యవరహిస్తూ పోతే చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చింది.