Logo
Download our app
జాతీయ రక్షణ నిధికి స్పీక‌ర్ విరాళం
NEWS   May 10,2025 12:39 pm
ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తన ఒక నెల వేతనాన్ని జాతీయ ర‌క్ష‌ణ నిధికి విరాళంగా అందజేశారు. ఆన్‌లైన్ పేమెంట్ ద్వారా ఈ విరాళాన్ని ఆయన జమ చేశారు. దేశ సాయుధ దళాలు ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు చేస్తున్న ధైర్య సాహసాలు ప్రతి భారతీయునిలో గర్వాన్ని కలిగించే అంశమ‌ని పేర్కొన్నారు. దేశ రక్షణ కోసం ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్న వీర జవాన్లకు నా వంతుగా సంఘీభావంగా నా నెల వేతనాన్ని విరాళంగా ఇచ్చాన‌న్నారు. ఉగ్రవాద నిర్మూలనలో సాయుధ దళాలు ప్రదర్శిస్తున్న ధైర్య సాహసాలు దేశ ప్రజలందరికీ గర్వకారణంగా నిలుస్తున్నాయన్నారు.
⚠️ You are not allowed to copy content or view source