Logo
Download our app
ఘ‌నంగా శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు
NEWS   May 10,2025 08:01 am
శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయ మహోత్సవాలు తిరుమలలో ఘనంగా ముగిసాయి.శ్రీవారి ఆలయం నుండి స్వామివారు గరుడ వాహనంపై, దేవేరులు వేర్వేరు పల్లకీలపై ఊరేగింపుగా బయల్దేరి నారాయణగిరి ఉద్యానవనంలోని పద్మావతీ పరిణయోత్సవ మండపానికి వేంచేపు చేశారు. ఎదుర్కోలు, పూల చెండ్లాట, నూతన వస్త్ర సమర్పణ తదితర క‌ల్యాణ వేడుకలు ఘనంగా ముగిసిన తరువాత కొలువు జరిగింది. వెంటనే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదాలను పారాయణం చేశారు. కళాకారులు మంగ‌ళ‌క‌రంగా సంగీత‌, మేళ‌, తాళ వాయిద్యాలను ప్ర‌ద‌ర్శించారు.
⚠️ You are not allowed to copy content or view source