Logo
Download our app
మే 12 నుండి అన్న‌మాచార్యుల జ‌యంతి ఉత్స‌వాలు
NEWS   May 10,2025 07:55 am
పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి 617వ జయంతి ఉత్సవాలు మే 12 నుండి 18వ తేదీ వరకు అన్నమయ్య జన్మస్థలమైన తాళ్లపాకలోని ధ్యాన మందిరం, 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద, తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో జ‌రుగ‌నున్నాయి. ఇందులో భాగంగా మే 12వ తేదీన తాళ్ల‌పాక‌లోని ధ్యాన‌మందిరం వ‌ద్ద ఉద‌యం 10.30 గంట‌ల‌కు శ్రీనివాస‌ కల్యాణం నిర్వ‌హిస్తారు. ఇదిలా ఉండ‌గా తాళ్ల పాక‌లో 12 నుండి 14వ తేదీ వరకు సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు తాళ్ల‌పాక‌లోని ధ్యాన మందిరం వ‌ద్ద, 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద భక్తి సంగీత, నృత్య కార్యక్రమాలు నిర్వ‌హిస్తారు.
⚠️ You are not allowed to copy content or view source