Logo
Download our app
అంగ‌రంగ వైభవం బుగ్గోత్సం
NEWS   May 10,2025 07:47 am
తిరుపతి శ్రీ గోవింద రాజ స్వామి వారి ఆలయంలో బుగ్గోత్సవం అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. మూడు రోజుల పాటు జరుగనున్న ఈ ఉత్సవంలో మొదటిరోజు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.ఉదయం సుప్రభాతంతో స్వామి వారిని మేల్కొలిపి విశ్వరూప దర్శనం కల్పించారు. అనంతరం శ్రీ గోవింద రాజ స్వామివారి ఆలయంలోని బుగ్గ వద్దకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారిని వేంచేపు చేశారు. మ‌ధ్యాహ్నం 2.30 గంటలకు స్వామి,అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం, సమర్పణ, ఆస్థానం నిర్వహించారు.
⚠️ You are not allowed to copy content or view source