Logo
Download our app
ఏపీలో ఎండ‌లు భ‌గ‌భ‌గ‌
NEWS   May 10,2025 06:45 am
ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. రాష్ట్రంలో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతుందని ఎండీ రోణంకి కూర్మనాథ్ సూచించారు. నిన్న 42°C ఉష్ణోగ్రత రికార్డైందని పేర్కోన్నారు. శనివారం 42°C- 43.5°C మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. మన్యం జిల్లా పాలకొండ, తూర్పుగోదావరి జిల్లా గోకవరం, కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలాల్లో తీవ్ర వడగాలులతో పాటు 23 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఆదివారం 7 మండలాల్లో తీవ్ర, 46 మండలాల్లో రేపు విజయనగరం-8, పార్వతీపురంమన్యం-9, అల్లూరి సీతారామరాజు-3, కాకినాడ-2, తూర్పుగోదావరి-1 మండలాల్లో (23) వడగాలులు వీచే అవకాశం ఉంద‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source