Logo
Download our app
ప్ర‌ధాని మోదీతో అజిత్ దోవ‌ల్ కీల‌క భేటీ
NEWS   May 09,2025 08:20 am
భార‌త్ పాకిస్తాన్ పై చేప‌ట్టిన దాడుల‌తో ఉక్కిరి బిక్కిరి అవుతోంది పాకిస్తాన్. ఆప‌రేష‌న్ సిందూర్ పై ఇవాళ కీల‌క స‌మావేశం జ‌ర‌గ‌నుంది. ఇందులో భాగంగా భార‌త జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు అజిత్ దోవ‌ల్ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ, ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. ఆప‌రేష‌న్ సిందూర్ గురించి వివ‌రాలు వెల్ల‌డించ‌నున్నారు. CDS, త్రివిధ దళాల అధిపతులు హాజ‌ర‌వుతారు. పాక్‌ దాడులు, భారత ప్రతిచర్యలపై జాతిని ఉద్దేశించి బ్రీఫ్ చేయ‌నున్నారు.
⚠️ You are not allowed to copy content or view source