Logo
Download our app
8 వేల‌కు పైగా ఎక్స్ ఖాతాలు క్లోజ్
NEWS   May 09,2025 07:36 am
సోష‌ల్ మీడియా దిగ్గ‌జ సంస్థ ఎక్స్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. భార‌త్, పాకిస్తాన్ దేశాల మ‌ధ్య చోటు చేసుకున్న ఉద్రిక్త‌త చోటు చేసుకున్న నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. పాకిస్తాన్ కు చెందిన సోష‌ల్ మీడియా ఖాతాల‌ను బ్లాక్ చేయాల‌ని ఆదేశించింది. దీంతో ఎక్స్ ఫోక‌స్ పెట్టింది. ఈ మేర‌కు 8 వేల‌కు పైగా అకౌంట్ల‌ను క్లోజ్ చేసింది. భారత ప్రభుత్వం నుండి కార్యనిర్వాహక ఆదేశాలు అందాయి, దీనికి గణనీయమైన జరిమానాలు, కంపెనీ స్థానిక ఉద్యోగుల జైలు శిక్షతో సహా సంభావ్య జరిమానాలు విధించనున్న‌ట్లు హెచ్చ‌రించింది. అంతర్జాతీయ వార్తా సంస్థలు, ప్రముఖ X వినియోగదారులకు చెందిన ఖాతాలకు భారతదేశంలో యాక్సెస్‌ను బ్లాక్ చేయాలనే డిమాండ్లు ఈ ఆదేశాలలో ఉన్నాయి.
⚠️ You are not allowed to copy content or view source