మసూద్ అజర్ సోదరుడు మటాష్
NEWS May 08,2025 04:49 pm
భారత్ దెబ్బకు బెంబేలెత్తి పోతోంది పాకిస్తాన్. తాను మద్దతు ఇస్తున్న ఉగ్రమూకలకు చుక్కలు చూపిస్తోంది ఆపరేషన్ సిందూర్. జైషే ఉగ్రవాది మసూద్ అజర్ సోదరుడు అబ్దుల్ రవూఫ్ అజర్ హతమయ్యాడు. నిన్న పాకిస్తాన్ లోని బహవల్పూర్ లో జైషే కార్యాలయంపై భారత్ దాడి చేసింది. ఈ దాడులో మసూద్ కు చెందిన 10 మంది కుటుంబ సభ్యులు మృతి చెందారు. ఈ దాడులో తీవ్రంగా గాయపడిన రవూఫ్ ఇవాళ చికిత్స పొందుతూ మృతి చెందాడు. కందహార్ IC- 814 ఫ్లైట్ హైజాక్ లో అబ్దుల్ రవూఫ్ అజర్ కీలక పాత్ర పోషించాడు.