100 మంది టెర్రరిస్టులు హతం
NEWS May 08,2025 03:54 pm
భారత్ సిందూర్ ఆపరేషన్ లో 100 మంది ఉగ్రవాదులు మృతి చెందారని వెల్లడించారు దేశ రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్. ఇవాళ జరిగిన అఖిలపక్షం సమావేశంలో భారత్ జరిపిన దాడుల గురించి వివరించారు. ఇవాల్టితో ఆపరేషన్ సిందూర్ ఆగదన్నారు. భారత్ తిరిగి దాడులు చేయాలని అనుకోవడం లేదన్నారు. అయితే పాకిస్తాన్ ఉద్రిక్తతలు పెంచే ప్రయత్నాలు చేస్తే ధీటుగా సమాధానం ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నామని ప్రకటించారు.