Logo
Download our app
టాటా ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం
NEWS   May 08,2025 05:39 am
భార‌త్, పాకిస్తాన్ దేశాల మ‌ధ్య చోటు చేసుకున్న ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో టాటా ఎయిర్ ఇండియా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. జమ్మూ, శ్రీనగర్, లేహ్, జోధ్‌పూర్, అమృతసర్, జాంనగర్, రాజకోట్ ఎయిర్‌పోర్టుల నుంచి సర్వీసులు తాత్కాలికంగా నిలిపి వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. భద్రతా కారణాల వల్ల మే 10వ తేదీ వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని స్ప‌ష్టం చేసింది. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపడతామని పేర్కొంది.
⚠️ You are not allowed to copy content or view source