Logo
Download our app
ఆప‌రేష‌న్ సింధూర్ లో మ‌హిళా ఆఫీస‌ర్స్
NEWS   May 08,2025 04:52 am
భార‌త్ చేప‌ట్టిన ఆప‌రేష‌న్ సింధూర్ లో ఇద్ద‌రు మ‌హిళా అధికారులు క‌ల్న‌ల్ సోఫియా ఖురేషి, వింగ్ క‌మాండ‌ర్ వ్యోమికా సింగ్ లు కీల‌క పాత్ర పోషించారు. దీంతో దేశ వ్యాప్తంగా ఈ ఇద్ద‌రికీ అభినంద‌న‌లు వెల్లువెత్తుతున్నాయి. నిజమైన నాయకత్వం లేబుళ్ళకు అతీతమైనది. ఇది ధైర్యం, నైపుణ్యం, అంకితభావం ద్వారా నిర్వచించబ‌డుతుంద‌ని స్ప‌ష్టం చేశారు ప్ర‌ధాని మోదీ. ఉగ్ర‌వాద స్థావ‌రాల‌ను గుర్తించామ‌ని, టెర్ర‌రిస్ట్ మూక‌లు ఎక్క‌డ ఉన్నా వెతికి ప‌ట్టుకుని ఖ‌తం చేస్తామ‌ని ఈ ఇద్ద‌రు హెచ్చరించారు. దీంతో ఈ ఇద్ద‌రు మ‌హిళలు సెన్సేష‌న్ గా మారారు.
⚠️ You are not allowed to copy content or view source