Logo
Download our app
అత్యవసర సర్వీసుల ఉద్యోగాల సెలువులు రద్దు
NEWS   May 07,2025 02:11 pm
ఆపరేషన్ సిందూర్ పై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ మేర‌కు కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో మంత్రులు, అధికారులు, ఉద్యోగులందరూ అందుబాటులో ఉండాలని ఆదేశించారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు.బ్లడ్ బ్యాంకుల్లో రక్త నిల్వలు సిద్ధం చేసుకోవాల‌ని, అత్యవసర ఔషధాలను సిద్ధం చేసుకోవాలని స్ప‌ష్టం చేశారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న బెడ్స్ వివరాలు ఎప్పటికప్పుడు తెలుసు కోవాల‌న్నారు. సైబర్ సెక్యూరిటీ మీద అప్రమత్తంగా ఉండాలన్నారు.ఫేక్ న్యూస్ ప్రచారం చేసే వారిపైన ఉక్కు పాదం మోపాలన్నారు. భారత సైన్యానికి మనం ఉన్నామనే సందేశం ఇవ్వాలన్నారు.
⚠️ You are not allowed to copy content or view source