అంజన్నను దర్శించుకున్న మహిళా కమిషన్ చైర్మన్
NEWS May 06,2025 03:42 pm
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్నను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద మంగళవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్బంగా విచ్చేసిన ఆమె స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శారద దంపతులను అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆమె మాట్లాడుతూ.. అంజన్నను దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు.