రేపే దేశ వ్యాప్తంగా మాక్ డ్రిల్
NEWS May 06,2025 11:41 am
భారత్-పాక్ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది. మే 7న బుధవారం దేశ వ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించాలని ఆదేశించింది. శత్రుదేశం దాడి చేస్తే ఎలా ఎదుర్కోవాలనే దానిపై సన్నద్ధత కార్యక్రమాలు చేపట్టాలని స్పష్టం చేసింది కేంద్ర హోం శాఖ. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రణాళికలను సిద్ధం చేసి, రిహార్సల్ జరపాలని సూచించింది. ఇదిలా ఉండగా 1971 తర్వాత తొలిసారిగా మాక్ డ్రిల్ చేపట్టనున్నారు.