Logo
Download our app
ప్రధాని మోదీతో రాహుల్ గాంధీ భేటీ
NEWS   May 06,2025 07:35 am
భార‌త‌, పాకిస్తాన్ దేశాల మ‌ధ్య చోటు చేసుకున్న ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ప్ర‌ధాని మోదీతో భేటీ అయ్యారు. పీఎంఓ కార్యాల‌యంలో స‌మావేశం అయ్యారు. సీబీఐ కొత్త చీఫ్ ఎంపిక విషయమై నిర్వహించిన చ‌ర్చ‌ల్లో పాల్గొన్నారు. మోదీ అధ్యక్షతన జరిగిన సీబీఐ డైరెక్టర్ నియామక కమిటీ సమావేశానికి రాహుల్‌తో పాటు సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా హాజ‌ర‌య్యారు. ప్రస్తుత సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పదవీ కాలం మే 25న ముగియనున్న తరుణంలో కొత్త చీఫ్ ఎంపికపై చర్చించారు.
⚠️ You are not allowed to copy content or view source