Logo
Download our app
ఉన్న‌త విద్య‌పై లోకేష్ స‌మీక్ష
NEWS   May 06,2025 07:31 am
విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ స‌మీక్ష చేప‌ట్టారు. పాఠశాల, ఇంటర్మీడియట్, ఉన్నత విద్యపై ఆరా తీశారు. జూన్ 6వ తేదీ నుంచి మెగా డీఎస్సీ పరీక్ష నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. టీచర్స్ ట్రాన్స్‌ఫర్ యాక్ట్‌కు అనుగుణంగా ఉపాధ్యాయుల బదిలీలు ఉండాలని సూచన‌లు చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభం నాటికే పాఠ్య పుస్తకాలు, కిట్స్ సిద్ధం చేయాలన్నారు. అంబేద్కర్ విదేశీ విద్య పునః ప్రారంభానికి గైడ్‌లైన్స్‌ రూపొందించాలన్నారు. ఉన్నత విద్యను అభ్యసించే బాలికల కోసం 'కలలకు రెక్కలు' పథకాన్ని ఈ ఏడాది నుంచే ప్రారంభించేందుకు విధి విధానాలు రూపొందించాలన్నారు.
⚠️ You are not allowed to copy content or view source