Logo
Download our app
కాంట్రాక్ట‌ర్, అధికారుల నిర్ల‌క్ష్యం వ‌ల్లే ప్ర‌మాదం
NEWS   May 06,2025 06:42 am
సింహాచలం దుర్ఘటనపై ప్రభుత్వానికి త్రిసభ్య కమిటీ నివేదిక అంద‌జేసింది. కాంట్రాక్టర్, అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని నిర్దారించింది. భక్తుల ప్రాణాలు కోల్పోవడానికి కాంట్రాక్టర్, అధికారులు కారణమయ్యారని తేల్చింది. కమిటీ సిఫారసు ఆధారంగా చర్యలకు ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. దేవాదాయ, పర్యాటక శాఖకు చెందిన ఏడుగురు అధికారుల సస్పెన్షన్‌కు ఆదేశించింది. కాంట్రాక్టర్‌ను బ్లాక్‌ లి‌స్టులో పెట్టాలని స్ప‌ష్టం చేసింది. కాంట్రాక్టర్ సహా, ఇద్దరు అధికారులపై క్రిమినల్ చర్యలకు ఆదేశించింది సచివాలయంలో ముఖ్యమంత్రికి నివేదిక ఇచ్చింది క‌మిటీ.
⚠️ You are not allowed to copy content or view source