Logo
Download our app
కొండగట్టు అంజన్న హుండీ ఆదాయం రూ. 1 కోటి 7 లక్షల 67 వేలు
NEWS   May 06,2025 06:38 am
కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానంలో 39 రోజులకు గాను 12 హుండీలను కార్యనిర్వహణాధికారి శ్రీకాంత్ రావు పర్యవేక్షణలో శ్రీ లలితా సేవా ట్రస్ట్ వారిచే లెక్కించారు. హుండీ ఆదాయం రూ.1,07,67,134 నగదు, 134 విదేశీ కరెన్సీ లభించినట్లు అధికారులు తెలిపారు. అలాగే వచ్చిన వెండి, బంగారంను ఒక బ్యాగ్ లో వేసి సీల్ చేసి తిరిగి హుండీలో భద్రపరిచినట్లు వెల్లడించారు. ఈ లెక్కింపులో ఆలయ అధికారులు, అర్చకులు, పోలీసు, హోంగార్డ్, సెక్యూరిటీ, బ్యాంకు సిబ్బంది, పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source