మల్యాల మండలంలో స్వల్పంగా కంపించిన భూమి
NEWS May 06,2025 06:38 am
మల్యాల మండలంలో సోమవారం సాయంత్రం స్వల్ప భూకంపం సంభవించింది. సాయంత్రం 6:50 నిమిషాలకు దాదాపు 5 సెకండ్లు భూమి కంపించింది. దీంతో ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. ఇంట్లో ఉన్న వస్తువుల కొన్ని కింద పడిపోయాయి. గడిచిన నాలుగు నెలల్లో భూమి కంపించడం ఇది రెండోసారి కావడం వలన ప్రజలు భయాందోళనల్లో ఉన్నారు.