Logo
Download our app
నితిన్ గ‌డ్క‌రీ లాంటి మంత్రిని చూడ‌లేదు
NEWS   May 05,2025 04:49 pm
కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీపై ప్ర‌శంస‌లు కురిపించారు మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి. రాజ‌కీయాల‌కు అతీతంగా త‌ను ప‌ని చేస్తార‌ని అన్నారు. త‌న 30 ఏళ్ల రాజ‌కీయ జీవితంలో ఇలాంటి నేత‌ను చూడ‌లేద‌న్నారు. ప‌ని ఉందని చెప్పిన వెంట‌నే నిమిషంలో ఆ ప‌నిని పూర్తి చేస్తారంటూ కొనియాడారు. ఆయ‌న లాంటి మంత్రి ఉండ‌డం బీజేపికి వ‌రం అన్నారు. తాను ఎప్పుడు క‌లిసినా ఏం ప‌నులు చేయాల‌ని అడిగారంటూ తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source