Logo
Download our app
ఈడీ నిర్వాకం సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం
NEWS   May 05,2025 04:38 pm
కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ఈడీపై సీరియ‌స్ అయ్యింది సుప్రీంకోర్టు. ఆధారాలు లేకుండా ఈడీ అరెస్టులు చేస్తోందని పేర్కొంది. ఛత్తీస్‌గఢ్‌ లిక్కర్‌ స్కామ్‌లో ఒక్క పైసా కూడా స్వాధీనం చేసుకున్నట్టు ఈడీ చూపించలేదని మండిప‌డింది. గతంలోనూ అనేక కేసుల్లో ఆధారాలు చూపించలేదని వ్యాఖ్యానించింది.తరచూ ఈడీ తప్పుడు కేసులు పెడుతోందని, ప్రతి స్కామ్‌లో ఈడీ తీరు ఇలానే ఉందని, అరెస్టులు చేయడం అలవాటుగా మారిందని సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.
⚠️ You are not allowed to copy content or view source