జగిత్యాల జిల్లా విశ్వకర్మ సంఘం అధ్యక్షుడిగా సత్యం
NEWS May 05,2025 11:35 am
విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం జగిత్యాల జిల్లా అధ్యక్షుడిగా టీ.వి సత్యం ఎన్నికైనట్లు ఆ సంఘం అంతర్జాల సమూహ వేదికగా విడుదల చేసిన ప్రకటనలో నిర్వాహకులు తెలిపారు. జగిత్యాల జిల్లాలోని 18 మండలాల అధ్యక్ ప్రధాన కార్యదర్శి, కోశాధికారుల సమ్మతం మేరకు ఏకగ్రీవంగా తీర్మానంతో ఎన్నుకున్నట్లు వారు తెలిపారు. టీ.వి సత్యం అధ్యక్షుడి గా ఎన్నిక కావడం ఇది మూడవ పర్యాయంగా వారు తెలిపారు. పలువురు ఆయనకు శుభాభినందనలు తెలిపారు.