Logo
Download our app
గంజాయి కేసులో గుర్రాన్ని అరెస్టు చేసిన పోలీసులు
NEWS   May 04,2025 07:25 pm
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం వత్సవాయి మండలం లో గంజాయి అక్రమార్కులు గుర్రాన్ని అడ్డం పెట్టుకొని గుర్రంపై చక్కర్లు కొడుతూ గంజాయిని అమ్ముతూ గ్రామంలో కనీవిని ఎరగని రీతిలో గంజాయి రవాణా చేస్తున్నారు. సంఘటన స్థలంలో ఒక గుర్రం, నెంబర్ ప్లేట్ లేని బైక్ మాత్రమే దొరికాయి. గంజాయి అక్రమ దందా నడిపిస్తూ ఉన్న అక్రమార్కులు పరారీలో ఉన్నారు. వారు వత్సవాయి గ్రామానికి చెందిన వారుగా తెలుస్తోంది.
⚠️ You are not allowed to copy content or view source