Logo
Download our app
భారీ వ‌ర్షం అప్ర‌మ‌త్త‌త అవ‌స‌రం
NEWS   May 04,2025 03:07 pm
భారీ వర్షాల కారణంగా అధికారులను అప్రమత్తం చేశారు మంత్రి కొలుసు పార్థసారధి. త్రాగు నీరు, పారిశుధ్యం, విద్యుత్ సమస్యలు గుర్తించి తక్షణమే పరిష్కరించాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూడాలని స్ప‌ష్టం చేశారు. అవసరాల మేరకు భద్రత చర్యలు , సమాచార, సహాయ సహకారాల కేంద్రాలు పక్కాగా ఏర్పాటు చేయాలన్నారు. మామిడి పంట నష్టం పూర్తి వివరాలు తెలియ జేయాలని ఆదేశించారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా పటిష్టమైన చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source