Logo
Download our app
మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ సిద్దం
NEWS   May 04,2025 12:42 pm
ప్ర‌పంచ అందాల పోటీల‌కు హైద‌రాబాద్ సిద్దం అవుతోంది. ఈనెల 10న గ‌చ్చిబౌలిలో స్టార్ట్ కానుండ‌డంతో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది రాష్ట్ర ప్ర‌భుత్వం. దీనిని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. మిస్ వ‌ర‌ల్డ్ పోటీల్లో ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా ప్ర‌త్యేకంగా ఏర్పాట్లు చేశారు. నోడ‌ల్ ఆఫీస‌ర్, అడిష‌న‌ల్ డీజీ స్టీఫెన్ ర‌వీంద‌ర్ నేతృత్వంలో ప్ర‌త్యేక బృందాలు ప‌ని చేస్తున్నాయి. ఈవెంట్ జ‌రిగే ప్రాంతాల్లో వంద‌ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. రాచకొండ, హైదరాబాద్ ,సైబరాబాద్ కమిషనరేట్స్‌తో సహా మిస్ వరల్డ్ పోటీదారులు పర్యటించే జిల్లాల్లో హైసెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీనియర్ పోలీసు అధికారులు, ఇతర శాఖల ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్ష చేప‌ట్టారు.
⚠️ You are not allowed to copy content or view source