Logo
Download our app
నేడు దేశ వ్యాప్తంగా నీట్‌ పరీక్ష
NEWS   May 04,2025 07:52 am
దేశ వ్యాప్తంగా ఆదివారం నీట్ ప‌రీక్ష జ‌ర‌గ‌నుంది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు రెండు షిప్టుల్లో పరీక్ష జ‌ర‌గ‌నుంది. తెలంగాణ నుంచి నీట్‌కు 72,507 మంది విద్యార్థులు హాజ‌ర‌వుతారు. ఈ మేరకు రాష్ట్రంలో 190 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒక్క హైదరాబాద్‌లోనే 62 పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. 26 వేల మంది ఇక్క‌డ ఎగ్జామ్ రాయనున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పరీక్షా కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు.
⚠️ You are not allowed to copy content or view source