Logo
Download our app
పాకిస్తాన్ తో భార‌త్ వాణిజ్యం ర‌ద్దు
NEWS   May 03,2025 12:45 pm
మోదీ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. పాకిస్తాన్ కు ఇప్ప‌టికే నీళ్ల‌ను నిలిపి వేసింది. గ‌గ‌న త‌లాన్ని మూసి వేసింది. ఆ దేశానికి చెందిన భార‌త్ పై నిరంత‌రం విషం క‌క్కుతున్న వెబ్ సైట్స్, యూట్యూబ్ ఛాన‌ళ్ల‌ను నిషేధించింది. తాజాగా మ‌రోసారి షాక్ ఇచ్చింది. పాకిస్తాన్ తో వాణిజ్యాన్ని పూర్తిగా ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఎగుమ‌తులు, దిగుమ‌తుల‌ను నిలిపి వేస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది. ప్రత్యక్ష, పరోక్ష దిగుమతులను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కేంద్రం. త‌క్ష‌ణ‌మే అమ‌ల్లోకి ఆంక్ష‌లు రానున్నాయి.
⚠️ You are not allowed to copy content or view source