Logo
Download our app
పాకిస్తాన్ కు భార‌త్ షాక్..సైట్స్, ఛాన‌ళ్లు బ్యాన్
NEWS   May 03,2025 11:15 am
భార‌త్, పాకిస్తాన్ దేశాల మ‌ధ్య ఉద్రిక్త‌త‌లు నెల‌కొన్న త‌రుణంలో కేంద్ర ప్ర‌భుత్వం షాక్ ఇచ్చింది పాకిస్తాన్ కు. ఆ దేశానికి చెందిన అనేక వార్తా , వినోదాత్మ‌క వెబ్ సైట్స్ తో పాటు టాప్ లో కొన‌సాగుతున్న యూట్యూబ్ ఛాన‌ళ్ల‌ను నిషేధించింది. బ్యాన్ విధించిన వాటిలో డాన్, జియో టీవీ, ఏఆర్ వై న్యూస్, స‌మ్మ టీవీ, బోల్ న్యూస్ ఉన్నాయి. ఇవ‌న్నీ భార‌త వ్య‌తిరేక ప్ర‌చారం లో మునిగి పోయాయ‌ని, అందుకే చ‌ర్య‌లు తీసుకోవాల్సి వ‌చ్చింద‌ని పేర్కొంది కేంద్రం. ఈ నిర్ణ‌యం కార‌ణంగా పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ పై తీవ్ర ప్ర‌భావం చూపింది. 7,000 పాయింట్లు కుప్ప కూలింది.
⚠️ You are not allowed to copy content or view source