Logo
Download our app
శ్రీ కపిల తీర్థం ఆలయంలో మాక్ డ్రిల్
NEWS   May 03,2025 08:28 am
కాశ్మీర్ లోని పహల్గామ్ ప్రాంతంలో ఉగ్ర‌దాడి నేప‌థ్యంలో ముంద‌స్తు జాగ్ర‌త్త‌గా తిరుపతిలోని శ్రీ కపిలతీర్థం ఆలయంలోకి ఉగ్రవాదులు చొరబడినప్పుడు ఎలాంటి భద్రతా పరమైన చర్యలు చేపట్టాలనే అంశంపై ఆక్టోపస్, పోలీసు, టిటిడి విజిలెన్స్, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది సమిష్టిగా మాక్ డ్రిల్ నిర్వహించారు. ముందుగా కపిలతీర్థం సమీపంలో జిల్లా అటవీ శాఖ కార్యాలయం ప్రాంగణం నుండి ఆక్టోపస్ బలగాలు మూడు గ్రూపులుగా వ్యూహాత్మకంగా సమన్వయంతో ఆలయంలోకి ప్రవేశించి భక్తులను ఎలా రక్షించాలి అనే విషయాలను మాక్ డ్రిల్ చేప‌ట్టారు.
⚠️ You are not allowed to copy content or view source