Logo
Download our app
పుష్ప యాగానికి అంకురార్పణ
NEWS   May 03,2025 08:22 am
తిరుపతిలోని శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయంలో పుష్ప యాగానికి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు పుణ్యాహ వ‌చ‌నం, మృత్సం గ్ర‌హ‌ణం, సేనాధిప‌తి ఉత్స‌వం, అంకురార్పణం నిర్వహించారు. ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీ లక్ష్మణ సీతా సమేత శ్రీ కోదండరామ స్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్ల‌తో అభిషేకం చేశారు.
⚠️ You are not allowed to copy content or view source