Logo
Download our app
రోడ్డు ప్ర‌మాదం జ‌గ‌న్ సంతాపం
NEWS   May 03,2025 07:52 am
నంద్యాల జిల్లాలో ఆటో బోల్తాపడి నలుగురు మృతి చెందిన ఘ‌ట‌న‌పై స్పందించారు మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డి. తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. బాధిత కుటుంబాల‌కు సంతాపం తెలిపారు.. ఆదోనికి చెందిన వారు శ్రీశైలంలో దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణంలో మృత్యువాత పడటంపై తీ వ్రవిచారం వ్యక్తం చేశారు. దైవ దర్శనం ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్ళే సమయంలో ఇటువంటి దుర్ఘటన చోటు చేసుకోవడం అత్యంత బాధాకరమన్నారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
⚠️ You are not allowed to copy content or view source