Logo
Download our app
భ‌క్తుల ఫీడ్ బ్యాక్ కోసం కొత్త విధానం
NEWS   May 02,2025 11:38 am
టీటీడీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. భక్తుల అభిప్రాయాల కోసం టీటీడీ కొత్త వాట్సాప్ ఫీడ్‌బ్యాక్ విధానం అమలు చేస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు ఈవో జె. శ్యామ‌ల రావు. మెరుగైన సేవలు అందించేందుకు టీటీడీ ఓ కొత్త ఫీడ్‌బ్యాక్ విధానాన్ని ప్రవేశ పెట్టిందన్నారు. ఇకపై భక్తులు తమ అభిప్రాయాన్ని వాట్సాప్‌ ద్వారా సులభంగా తెలియ జేయవచ్చ‌న్నారు. తిరుమల, తిరుపతిలో పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్‌లను మొబైల్‌తో స్కాన్ చేస్తే వాట్సాప్‌లో టీటీడీ అభిప్రాయ సేకరణ పేజీ ఓపెన్ అవుతుందన్నారు. ఇక్కడ భక్తులు తమ పేరు, విభాగం (అన్నప్రసాదం, శుభ్రత, కల్యాణకట్ట, లడ్డూ ప్రసాదం, లగేజీ, దర్శన అనుభవం, క్యూలైన్, గదులు మొదలైనవి)ను ఎంచుకోవాల్సి ఉంటుంద‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source