Logo
Download our app
రాజ‌స్థాన్ పై ముంబై గ్రాండ్ విక్ట‌రీ
NEWS   May 02,2025 08:08 am
రాజ‌స్థాన్ లోని స‌వాయి మాన్ సింగ్ స్టేడియంలో జ‌రిగిన కీల‌క లీగ్ మ్యాచ్ లో ముంబై ఇండియ‌న్స్ భారీ తేడాతో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ను ఓడించింది. ఏకంగా 100 ర‌న్స్ తేడాతో గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 2 వికెట్లు కోల్పోయి 217 ర‌న్స్ చేసింది. 218 ర‌న్స్ టార్గెట్ తో బ‌రిలోకి దిగిన రాజ‌స్థాన్ ఆట‌గాళ్లు ఎవ‌రూ మైదానంలో నిల‌వ‌లేక పోయారు. జోఫ్రా ఆర్చ‌ర్ 30, జైశ్వాల్ 13, ప‌రాగ్ 16 , రాణా 9 ప‌రుగులు చేశారు. దీంతో టోర్నీలో ప్లే ఆఫ్స్ కు దూర‌మైంది ఆర్ఆర్.
⚠️ You are not allowed to copy content or view source