Logo
Download our app
ఉగ్ర‌వాదులు ఎక్క‌డున్నా శిక్షిస్తాం
NEWS   May 01,2025 07:40 pm
ఉగ్రదాడిపై తొలిసారిగా స్పందించారు కేంద్ర మంత్రి అమిత్ షా. ఉగ్రవాదాన్ని అంతం చేసే వరకు తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందన్నారు. ఉగ్రవాదులు ఎక్కడున్నా వెతికి పట్టుకొని శిక్షిస్తామ‌ని వార్నింగ్ ఇచ్చారు. ఉగ్రవాదులకు సరైన సమాధానం చెప్పడం ఖాయం అని స్ప‌ష్టం చేశారు. కాశ్మీర్‌లో ఉగ్రవాద చర్యలకు గట్టి సమాధానం ఇస్తున్నామ‌న్నారు.. దాడి చేసి విజయం సాధించామని అనుకుంటే అది పొరపాటేన‌ని పేర్కొన్నారు. ఇది మోడీ సర్కార్, ఎవరిని వదిలి పెట్టదన్నారు. దాడికి కారణమైన ప్రతి ఒక్కరు మూల్యం చెల్లించు కోవాల్సిందేన‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source