Logo
Download our app
ఆర్టీసీ కార్మికులు సమ్మె ఆలోచన వీడండి
NEWS   May 01,2025 04:35 pm
సీఎం రేవంత్ రెడ్డి ఆర్టీసీ కార్మికులకు స‌మ్మె ఆలోచ‌న‌ను వీడాల‌ని కోరారు. ఇది మీ సంస్థ‌, దీనిని కాపాడుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంద‌న్నారు. ఇప్పుడిప్పుడే ఆర్టీసీ లాభాల బాటలో పయనిస్తోందని చెప్పారు. వచ్చే ఆదాయమంతా మీ చేతిలో పెడతామ‌ని, ఎలా ఖర్చు చేద్దామో మీరే సూచన చేయాల‌ని కోరారు. అణా పైసా కూడా నేను ఇంటికి తీసుకెళ్లేది లేదన్నారు. మీ కోస‌మే ఖ‌ర్చు చేశామ‌న్నారు. రాష్ట్ర ఆర్థిక వ్య‌వ‌స్థ ఇప్పుడిప్పుడే గాడిలో ప‌డింద‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source